సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం, ఈ నలుగు యుగాల్లో భగవంతుని పంచసఖులు భూమిపై జన్మించెదరు. యుగాంతంలో విష్ణుభగవానుని ధర్మసంస్థాపన కార్యంలో పంచసఖులు సహకరించెదరు. యుగకర్మ ముగిసిన తరువాత విష్ణుభగవానులు గోలోక వైకుంఠము వెళ్ళెదరు. పంచసఖులు భగవంతుని అవయవాల నుంచే జన్మించెదరు. ప్రతీ యుగంలో పంచసఖులు వేర్వేరు రూపాలలో భూమిపై అవతరించెదరు. భవిష్యమాలిక మరియు పురాణాలలో దొరికిన ప్రమాణాలను బట్టి సత్యయుగంలో ఈ పంచసఖుల పేర్లు- నారద, మార్కండేయ, గార్డవ, స్వయంభు మరియు కృపాజల, సత్యయుగం చివరలో తాము చేయవలసిన పని ముగిసిన తరువాత పంచసఖులు తిరిగి గోలోక వైకుంఠము వెళ్ళినారు. త్రేతాయుగం చివరలో భగవాన్‌ శ్రీరామచంద్రుని ద్వారా ధర్మసంస్థాపన సమయంలో మరలా జన్మించడం జరిగింది. ఆ సమయంలో వారిపేర్లు- నల, నీల, జాంబవంత, శుషేణ మరియు హనుమాన్‌. హనుమంతుడు రుద్ర అవతార రూపంలో జన్మించినప్పటికీ పంచసఖులలో ఒక్కరిగా ప్రభువు శ్రీరామచంద్రుని ద్వారా జరిగిన ధర్మసంస్థాపన కార్యంలో తమ సహాయం చేసెను. త్రేతాయుగంలో కూడా తాము చేయవలసిన పని ముగిసిన తరువాత పంచసఖులు తిరిగి గోలోక వైకుంఠము వెళ్ళిరి. పంచసఖులు ద్వాపరయుగంలో కూడా జన్మించడం జరిగింది మరియు శీకృష్ణ భగవానుని ద్వారా జరిగిన ధర్మసంస్థాపన కార్యక్రమంలో చేయూతనివ్వడం జరిగింది. ద్వాపర యుగంలో పంచసఖుల పేర్లు- దామ, సుధామ, సుబల, సుబాహు మరియు శ్రీవచ్చ. కలియుగం అంతిమ సమయానికి 500 సంవత్సారాల క్రితం భగవానుని పంచ సఖులు జన్మించడం జరిగింది. కలియుగంలో వారి పేర్లు-అచ్యుతానంద దాస్‌, అనంత దాస్‌, యశోవంత దాస్‌, జగన్నాధ దాస్‌ మరియు బలరాందాసి. వారు నిరాకార బ్రహ్మ శ్రీ జగన్చాధుని ఆదేశం (ప్రకారం భూమిపై జన్మించి ఈ దివ్య గ్రంథం భవిష్య మాలికగా రచించడం జరిగింది. ఎప్పుడయితే భూమిపై భారం పెరిగి ధర్మానికి హాని వాటిల్లుతుందో మరియు అందరి మనస్సులలో దయ, క్షమ, స్నేహం, శ్ర బదులుగా హింస, ద్వేషం, క్రోధం, కామం, ఈర్ష్య ఉంటాయో అప్పుడు నాలుగు యుగాల భక్తుల దుఃఖాలను దూరం చేసి భూమిపైన సత్యం, శాంతి, దయ, క్షమ మరియు మటైమ నెలకొల్పి భూమాత భారం తగ్గించడం, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కొరకు భూమిపైన అవతరించెదనని భగవంతుడు స్వయంగా చెప్పియున్నారు. కలియుగాంతంలో నేను కల్కి అవతారం తీసుకొనే ముందు మీరు (పంచ సఖులు) ధర్మాన్ని పునః స్థాపన కొరకు, నాలుగు యుగాల భక్తుల ఉద్ధరణ, వారి ఏకత్రీకరణ మరియు చెడుమార్గంలో నున్చవారిని సన్మార్గంలోనికి నడివించడానికి భవిష్యమాలికను రచించండి అని భగవానులు వారు స్వయంగా చెప్పారు. అందుకే అచ్యుతానంద దాస్‌ ఈ విధంగా (వ్రాసారు-
“పేతు రసాయిబ పాయికి అచ్యుత సాహ1స్త్ర పురాణం కలే కలి కాల టారు బలి కాల జావీం హక్‌ కథా ట లేళఖిలే”
దీని అర్థం: ఏమిటంటే నిద్రావస్థలో నున్న బోక్తుల చేతన జాగృతం చేయుటకు, మహాపురుష అచ్యుతానంద దాస్‌ గారు కలియుగం నుంచీ సంగమ యుగం వరకు మరియు సంగమ యుగం నుంచీ సత్యయుగం వరకు జరగబోవు యదార్దాలను భవిష్య మాలికలో వర్ణించడం జరిగింది. ఈ గ్రంధం చదవడం ద్వారా కలియుగంలోని భక్తులకు చేతనము జాగృతం అవ్వడమే కాకుండా భగవంతుని గురించి వెతికెదరు మరియు శరణు కోరెదరు. మహాప్రభు, అనాది దైవము హరి, జగత్తుకు నాథుడు అయిన జగన్నాధుడు మహాపురుష్‌ అచ్యుతానంద దాస్‌ గారికి ఒక కమలం పువ్వులతో కట్టిన మాలను అనుగ్రహించి ఎక్కడయితే ఈ కమల పువ్వులన్నీ విడిపోయి నేలమీద పడిపోతాయో అది నీ సాధనా పీఠం కాగలదని ఆదేశించెను. ఆయన జగన్చాథ (ప్రభువుని ఆదేశానుసారం పవిత్ర శీక్షేత్రం నుంచీ బయటకు వచ్చి వేర్వేరు మార్గాలలో ప్రయాణించి ఓడిషాలోని కేంద్రపార జిల్లాలోని చిత్రోత్సల నదిఒడ్డున ఉన్న “ేమాల' అనే పవిత్ర స్థానాన్ని చేరుకున్నారో చివరగా మిగిలిన కమలం పువ్వు కూడా విడిపోయి భూమిపైన పడిపోయెను. శాస్త్రాల ప్రకారం సత్యయుగంలో ఈ స్థానం నందే సముద్ర మధనం నుంచీ వచ్చిన కమలం పడిపోయెను. అందువలననే ఈ స్థానాన్ని “పద్మవనం” అని కూడా పిలుస్తారు. మహాపురుష్‌ అచ్యుతానంద దాస్‌గారు ఈ స్థానంలో తమ సాధనను ఆరంభించి ధ్యాన నిమగ్న మై సత్య, త్రేతా, ద్వాపర మరియు కలియుగాల భక్తుల ఉద్ధారం కొరకు లక్షకు పైగా గ్రంధాలను రచించడం జరిగింది.ఈ స్థానం తరువాతి కాలంలో మహాపురుష అచ్యుతానంద దాస్‌ గారి సిద్ధ స్థలం అనే పేరుతో ప్రసిద్ధమైనది. అచ్యుతానందదాస్‌ గారు మహాప్రభు చరణ కమలముల పై ధ్యానం చేస్తూ సిద్ధ స్థలమును గూర్చి ఇలా వ్రాసెను.
“శీ అచ్యుత దాస నేమాలె నివాస పద్మ బనేతాంక స్థితి, ప్రభున్ము అజ్ఞా రు అనుభవ కరి లక్షే గ్రంథ లేలఖిచంతి. చతిస్‌ సంహితా బాస్తరి గీతా వంశాను ససబిన్సరే , ఉపవంశాను ద్వాదస ఖండ బేనీ భవిష్య సస ఖండ రే"
దీని అర్థం: ఏమిటంటే మహాపురుష అచ్యుతానంద దాస్‌ గారు ఆ పవిత్ర స్థానంలో ధ్యానంలో కూర్చుని వారి దివ్య బలం ద్వారా లక్షకు పైగా గ్రంధాలను రచించారు. వాటిలో 36 సంహితలు, 72 గీతాలు, 27 వంశాను చరిత్రలు, 24 ఉప వంశాను చరిత్రలు మరియు 100 మాలిక గ్రంధాలు ఉన్నాయి. వీరు కాకుండా మిగిలిన నలుగురు సఖులు - అనంత దాస్‌ మహారాజ్‌ గారు, యశోవంత్‌ దాస్‌ మహారాజ్‌ గారు, జగన్నాధ్‌ దాస్‌ మహారాజ్‌ గారు మరియు బలారం దాస్‌ మహారాజ్‌ గారు చాలా మాలిక గ్రంధాలను రచించడం జరిగింది. ఈ గ్రంధాల రచన తరువాత కూడా పంచసఖులు చెప్పిన విషయం ఏమిటంటే ఈ గ్రంధాలను మేము వ్రాయలేదు కేవలం విశ్వ మానవ కళ్యాణం కొరకు, మహా ప్రభువు యొక్క ఆజ్ఞ పై మాత్రమే వ్రాసాము. సత్య యుగంలో తాపసులు, త్రేతాయుగంలో కపీశీద్రులు, ద్వాపరయుగంలో గోపాలు మరియు కలియుగంలో భక్తులు ఇలా నాలుగు యుగాలలోని భక్తులు ఈ అనంతయుగంలో ధరిత్రిపై రావడం జరిగింది. వారిచే జాగృతం చేసే సమయం మరియు మహాప్రభువు యొక్కలీలా విశేషాలులో పాల్గొనేందుకు సమయం ఆసన్నమైనది. ఈ విషయంలో జాగృతం చేయుటకు మరియు గోలోక వైకుంఠం లోని పూర్ణ సంస్కారాలను జాగృతం చేయుటకు పంచసఖుల ద్వారా మాలిక గ్రంథా రచన జరిగింది. భక్తులు విశ్వంలో ఏ మూలన ఉన్నా సరే మాలిక వినడం మరియు చదవడం ద్వారా వారి పూర్ణ చేతనా జాగృతం అయ్యి, వారికి మహాప్రభు భూమిపై ఆగమనం గురించి తెలియును మరియు వారు మహాప్రభు యొక్క శరణాగతిని పొందుదురు. నాలుగు యుగాల భక్తులు మహాప్రభు శ్రీ చరణాల వద్ద శరణు పొందెదరు. మరియు అనంత యుగంలోని ధర్మ సంస్థాపన కార్యంలో సహకరించెదరు. మహాప్రభు గురించి తెలుసుకొన్న తరువాత భక్తులు మహాప్రభువు సత్యయుగానికి సంబంధించి ఇచ్చిన నీతి- నియమాలను ప్రపంచంలో ప్రచారం చేసెదరు. భక్త జనులు మహాప్రభువు యొక్క నామం, గుణం మరియు మహిమ గురించి జయ జయ కారాలు చేసెదరు మరియు ధర్మ సంస్థావన కార్యంలో తమకు తాముగా పాల్గొనెదరు. ఈ విషయం గురించి అచ్యుతానంద దాస్‌ గారు ఇలా వ్రాసారు.
“భక్తే ఉదే హోయిబే, గాం గాం బులి మేలి కరిబే, రామచంద్ర రే, హరి చరణే భజిభే, రామచంద్ర రే”
దీని అర్థం: ఏమిటంటే భక్తులు ఎక్కడికి వెళ్తారో, అక్కడ కలిసి మెలిసి భజన-కీర్తన మరియు ధర్మ ప్రచారం చేయుదురు.  పంచసఖుల పరిచయము
  1. మహాపురుష్‌ అచ్యుతానంద దాస్‌ గారు  1485 సంవత్సరంలో ఒడిషాలోని కేంద్రపార స శ్‌ జిల్లాలోని తిలకణా ఈ ప్రదేశాన్ని త్రిపుం అని ౮ కూడా అందురు గ్రామంలో ర్రీ దీనబంధు ఖుంటియా, దేవి పద్మావతి దంపతులకు జన్మించెను. మహాపురుష్‌ అచ్యుతానంద దాస్‌ గారు 1,85,000 గ్రంథాలను రచించారు. తరువాత జ్యేష్ట శుక్ల ఏకాదశి రోజు నేమాల్‌ పీఠంలో సమాధి స్థితిలో కూర్చుని తమ ఇచ్చానుసారం పూర్ణిమ రోజు భౌతిక శరీరాన్ని వదలి శూన్యంలోకి అంతర్జానమయ్యెను. వారు రచించిన గ్రంథాలలో హరివంశ పురాణము, గోపాలంక్‌ ఓగాల్‌ ఓ లవుడి ఖ్రేల్‌, బార్మాసి గీతా, శూన్య సంహితా, అణాకార్‌ బ్రహ్మ సంహిత, మణిబంధ గీతా, జుగాబ్టి గీతా, బీజసాగర్‌ గీతా, అభేద్‌ కబచ్‌, అష్ట గుజ్జరీ నవ గుజ్జరీ, శరణపంజర్‌, స్రోత్‌, బీప్రవాచక్‌, మాన్‌ మహిమా మరియు వివిధ భజనలు, పాటలు రాసి, జణాన్‌, చౌతీసా ఒడియా భాషలో 84వ అక్షరంతో మొదలయి 84 పదాలు ఉండే కవితను చౌతీసా అందురు, టీకా, మాలికా మొదలగు గ్రంథాలు ముఖ్యమైనవి.
  2. మహాపురుష శిశు అనంతదాస్‌ గారు ఒడిషాలోని పూరి జిల్లాలోని బాలిపాటాణ్‌ గ్రామం దగ్గరలో 1488లో శ్రీ కపిలేంద్ర, గౌరాదేవి దంపతులకు జన్మించారు. వారు కూడా చాలా గ్రంధాలు మరియు మాలిక రచించారు. వాటిలో ముఖ్యమైనవి హేతు ఉదయ భగవత్‌, భక్తి ముక్తి దయక్‌ గీతా, శిశు భేద టీకా, శూన్య నాం బేద్‌, అర్థ తారేణి, ఉదే బాఖరా, ఠీక్‌ బాఖరా మరియు చాలా భజనలు, బౌతీసా, మాలిక గ్రంధము మొదలైనవి.
  3. శ్రీ జగన్నాధదాస్‌ మహరాజ్‌ గారు ఒడిషాలోని పూరి జిల్లాలోని కపిలేశ్వర గ్రామంలో శ్రీ భగవాన్‌ దాస్‌ గారు మరియు పద్మావతిదేవి దంపతులకు జన్మించెను. వారు సంస్కృత ర్రీ మద్భాగవతాన్ని మొట్టమొదటగా ఒరియా భాషలో రచించెను. వారి గ్రంధాలలో షోల చౌపది, చారి+చౌపది, తులభిణా, దారు బ్రహ్మగీతా, దీక్ష సంబాద్‌, అర్థ కోయిలి, ముగుణీ స్తుతి, గుప్త భాగవత్‌, అనామయ కుండలీ, శ్రీ కృష్ణ కల్పలతా, నిత్య గుప్త చింతామణి, నీలాద్రి బిలాస్‌, కలి మాలికా మరియు ఇంద్ర మాలికా ముఖ్యమైనవి. వారి శాస్త్ర జ్ఞానం మరియు భక్తి చూచి ముగ్గులైన ర్రీ చైతన్య మహాప్రభువులు, “అతిబడి” అనే ఉపాధితో వారిని అలంకరించెను.
  4. మహాపురుష బలరామ్‌ దాస్‌ గారు ఒడిశాలోని పూరీ జిల్లాలోని చంద్రపూర్‌ గ్రామంలో 1470వ సంవత్సరంలో (అక్కడక్కడ 1482 సంవత్సరం అని కూడా చెప్పబడింది) శీ షోమ్‌నాథ్‌ మహాపాత్ర మరియు మహామాయా దేవి దంపతులకు కుమారుడిగా జన్మించారు. దధ్యతా భక్తి, దండి రామాయణం, విశ్వ భూగోళశాస్త్రం, బౌల గై గీత, కమల్‌ లోచన్‌ చౌతీసా, కాంత కోయిలీ, లక్ష్మి పురాణం, బేధా పరిక్రమ, సప్తాంగ యోగసార్‌ టీకా, బ్రా కబాచ్‌, జ్ఞాన చూడామణి గద్యం, బ్రహ్మ టీకాగద్య తదితర గ్రంథాలను రచించారు. పూరీ జిల్లాలోని సంగర పట్‌ అనే ప్రదేశంలో ఆయన మరణించారు.
  5. మహాపురుష యశోవంత్‌ దాస్‌ గారు ఒడిషాలోని కటక్‌ జిల్లాలోని అధాంగ్‌ సమీపంలోని నంది గ్రామంలో 1482 సంవత్సరంలో (అక్కడక్కడ 1486 అని కూడా ప్రాయబడింది) శ్రీ బలభద్ర మల్ల మరియు రేఖాదేవి దంపతులకు జన్మించారు. చౌరాసి ఆజ్ఞ, శిబ్‌ స్వరద్వయ, షష్టిమాల,టైమ్‌ భక్తి బ్రహ్మగీత, టీకా గోవింద్‌ చంద్ర కరుణతో నిండిన పద్యం, ఇది బెంగాల్‌, అస్సాం నుండి ఉత్తర భారతదేశం వరకు అనేక ప్రాంతాలలో ప్రసిద్ధి చెందింది మొదలైన అనేక గ్రంథాలతో పాటు అనేక మాలిక గ్రంథాలను రచించారు. వారు తన శదీరాన్ని మార్చశీర్ష శుక్లపక్ష షష్టి ఓథాని షష్టిలో విడిచిపెట్టారు. పంచసఖులు ఆధ్యాత్మిక తత్వజ్ఞానం కలిగినవారు. వారు నిరాకార భగవానునితో అన్ని వేళలా సూక్ష్మ సాన్నిధ్యములో ఉండేవారు. నిరాకార భగవానులు రాబోయే భవిష్యత్తు గురించి ఏమి చెప్పారో, వారు తమ భవిష్యమాలిక గ్రంథాలలో అవే విషయాలను వ్రాశారు. ఈ విషయం గురించి బ్రహ్మ గోపాల్‌ మహాజ్ఞాత అచ్యుతానంద దాసుగారు ఇలా ప్రస్తావించారు-
“ఆగ్రమ భావ జాణే యశోబంత గార్‌ కట జంత్ర జాణే అనంత ఆగత్‌ నాగత్‌ అచ్యుత్‌ జాణే బలరాం దాస్‌ తత్వ బఖాణే భక్తి ర భావ జాణే జగన్చాథ పంచసఖా వి ఓడిషా మహంతా మెచ్చ పతిత ఉద్ధారిబ పాయీ జనమ లభిలే ఓడిషా భుయీ”
పై పంక్తుల అర్థం ఏమిటంటే-
  • పంచసఖులలోని శ్రీ యశోబంత దాస్‌ మహారాజ్‌ ఆగమ మరియు నిగమకు సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోగల సమర్ధులు. 
  • మహాపురుష శిశు అనంత్‌ దాస్‌ మహారాజ్‌ సాంకేతిక గణితశాస్త్రం ద్వారా భవిష్యత్తును తెలుసుకోవడంలో ప్రవీణుడు. 
  • మహాపురుష అచ్యుతానంద దాస్‌ మహారాజ్‌ గతం, వర్తమానం మరియు భవిష్యత్తు మొదలైన వాటి గురించి పరిజ్ఞానం మరియు పూర్తి తత్వజ్ఞానాన్ని కలిగిన వారు. 
  • మహాపురుష బలరామ్‌ దాస్‌ మహారాజ్‌ గ్రంథాలు మరియు విశ్వం యొక్క పూర్తి తత్వ జ్ఞానాన్ని కలిగిన వారు. మహాపురుష జగన్నాథ్‌ దాస్‌ మహారాజ్‌ పద్దెనిమిది పురాణాలలోని భక్తి తత్వాల జ్ఞానాన్ని కలిగిన వారు.
పంచసఖులు భవిష్యమాలిక ద్వారా నిరంకార శీజగన్చాధస్వామి ఆదేశంమై భక్తజనుల ఉద్ద్ధారం కోసం భవిష్యవాణి చేసితిరి. పంచసఖులు భవిష్యమాలికలో భక్తులు-భగవానులు కలుసుకొనుట, పాపాత్ములు మరియు దురాచారులు యొక్క వినాశనం, సత్యయుగ ఆరంభానికి సంబంధించిన విషయాలు తెలిపిరి. ఈ గ్రంధాలన్నీ ఇప్పుడు మనుష్య సమాజానికి సంజీవనిలా పనిచేయును. బ్రహ్మాండంలో మహావినాశానికి సమయం అతిత్వరలో రానున్చది. ఇటువంటి సంధి సమయంలో భవిష్యమాలికను అనుసరించుట, మహాప్రభువు యొక్క నామజపం చేయుట మరియు మహాప్రభువు యొక్క శరణు పొందుట తప్ప వేరే మార్గమే లేదు.

"జై జగన్నాథ్"