నాలుగు యుగాలు మరియు కలియుగంలో ధర్మ సంస్థాపన గురించి వివరణ శాస్త్రాలలో సత్య, త్రేతా,ద్వాపర మరియు కలి యుగము నాలుగు యుగాల వివరణ.
భగవంతుడైన మహావిష్ణువు నాలుగు యుగాలలో 24 అవతారాలు ఎత్తడం జరిగింది. వారి అవతారాల గురించి ఈ క్రింద యివ్వడం జరిగింది.
- కుమార్ అవతారము (1.సనక 2. సనందన, 3.సనాతన 4. సనత్కుమార)
- యోగేశ్వర
- యుజ్ఞవరాహ
- నారద అవతారవు
- వరనారాయణ అవతారము
- కపిల అవతారము
- దత్సాతేయ అవతారము
- యజ్ఞరూప అవతారము
- వృషభ అవతారము
- పృధుచక్రవర్తి అవతారము
- హంసావతారము
- మత్స్యావతారము
- చక్రధర అవతారము
- కూర్మ అవతారము
- ధన్వంతరి అవతారము
- మోహిని
- నరసింహ
- వామన
- పరశురామ
- వేదవ్యాస
- శ్రీరామ
- బలరామ
- బుద్ధ
- కల్కి
ఈ 24 అవతారాలలో ధర్మ సంస్థాపన కొరకు భగవంతుడు 10 అవతారాలు ధరించాడు.
1. మత్యావతారము :
చాక్టుషమన్వంతర అంతమున ముల్లోకములును సముద్రమున మునిగిపోవుచుండెను. అప్పుడు ర్రీ మహావిష్ణువు మత్భావతారము అవతరించెను. రాబోవు మన్వంతరాధిపతియైన వైవస్వతమనువును పృథ్విరూప నావపై కూర్చుండజేసి అతనిని కాపాడెను. మరియు ప్రళయ పయోదిలో మత్ఫ్రావతారుడై చమన రక్షించడము జరిగినది.
2. కూర్మావతారము :
దేవతలు దైత్యులు అమృతము కొరకు క్షీరసాగరమును మధించుచుండగా శ్రీహరికూర్మావతారమున తన వీపుపై మందరాచలమును వహించెను. వారి దయతో అమృతము దేవతలకు ప్రసాదింపబడినది.
3. వరాహ అవతారము:
లోక కళ్యాణార్థమై సమస్త యజ్ఞములకును స్వామియైన ఆ పరమేశ్వరుడురసాతలమున మునిగియున్న పృథ్విని ఉద్దరించుటకై యజ్ఞ వరాహ రూపము(గ్రహించెను. మహాసాగరములో మునిగిన పృథివిని కోరలతో పైకిఎత్తి పృథివిని రక్షించెను.
4. నరసింహ అవతారము :
శ్రీ మహావిష్ణువు నరసింహునిగా అవతరించెను. తన భక్తుడైన ప్రహ్లాదునిప్రార్థనపై అవతరించి మిగుల బలశాలియగు రాక్షస రాజైన హిరణ్యకశిపుని వక్షస్థలము తననఖములతో అవలీలగా చీల్చివైచి భక్తుని రక్షించెను.
5. వామనావతారము :
వామనావతారమున బలిచక్రవర్తి యొక్క యజ్ఞశాలను (ప్రవేశించి మూడడుగులనేలను దానముగా అడిగెను. ఆ నెపముతో ఆ ప్రభువు ముల్లోకములను ఆక్రమించిస్వర్ణరాజ్యమును మలల దేవతల వశము గావించెను. బలి చక్రవర్తియు ఆత్మ నివేదన ద్వారా అతనిని గౌరవించెను. ఆ విధముగా బలి చక్రవర్తి ఆ పరమ పురుషుని అనుగ్రహముతో “పుణ్యశ్లోకో బలీరాజా” అని ప్రసిద్ది వహించెను. భగవంతుని పాద నఖముల నుండి పుట్టిన గంగ పావనమైనది.
6. పరశురామ అవతారము :
రాజులు దురహంకారముతో బ్రాహ్మణ వంశములకు (ద్రోహము చేయసాగిరి. అప్పుడు ర్రీ మహావిష్ణువు పరశు రామ రూపము దాల్చి క్రోధముతో 21 మారులు రాజులపై దండెత్తి భూ మండలమున క్షతియుల వినాశము చేసెను. ప్రపంచ దుఃఖమును దూరము చేసెను.
7. రామావతారము :
భగవాన్ విష్ణువు దశరథుని కుమారునిగా యుద్ధములో ఇంద్రాది దేవతలకు సంతోషము కలుగునట్లు లోక కంఠకుడైన రావణుని వధించెను. అనేక రాక్షసులను వధించి ధర్మ సంస్థాపన చేసి మర్యాద పురుషోత్తముడని పేరుగాంచెను.
8. బలరామ అవతారము :
ఈ అవతారములో బలరామ ప్రభువుల గౌరవర్జ రూపముతో నూతన నీలిరంగు వస్రాలను ధరించెను. బలరామ ప్రభువుల నాగలిని చూసి యమునానది భయపడి అతని వస్త్రములో దాగినదా అనిపించినది (అనగా అతని శరణుజొచ్చినది) (గౌర వర్ణము – ఎరుపు, పసుపచ్చ, తెలుపు)
9. బుద్ద అవతారము:
కలియుగము (ప్రారంభమైన పిదప భగవానుడు దైత్యులను సమ్మోహ పరచుటకై కీకట భూములందు మధ్యగయా అను (ప్రదేశము నందు (మగధ – వీహార్) ఆంజన అను ఆమెకు పుత్రుడుగా జన్మించి (ప్రేమ, దయ ఉదారత భావముతో యజ్ఞ విధానము ద్వారా పశువుల హింస చూసి యజ్ఞవిధానమును తప్పుగా వచించి శాంతి,కరుణ ఉదారతలను ప్రపంచములో (ప్రచారము గావించెను.
10. కల్కి అవతారము:
ఈ అవతారములో శ్రీహరి కల్కి రూపము ధరించి మ్లేచ్చుల వినాశనము చేసి తోకచుక్కలాగ భయంకర రూపు ధరించి కలియుగ అంతానికి సాక్షులు అవుతారు.
నాలుగు యుగాల చివర భవిష్య మాలిక అనుసారము భూమిపై భగవానుడు భక్తుల సంగమ యుగము అనంత యుగములో ఐక్యత కల్పించి భవిష్య మాలిక అనుసారము నాలుగు యుగాల భక్తుల మనో వ్యాకులతను దూరము చేయుదురు. వారు 1009 సంవత్సరముల వరకు సుఖ శాంతులు కల్పించి పాలించగలరు.
“జై జగన్నాథ్”