చతుర్యుగ గణన (ప్రకారం, కలియుగం 4,82,000 సంవత్సరాల అనుభవించవలసి ఉన్నది. కానీ మనుషులు చేసే పాపకర్శల వల్ల కలియుగం యొక్క ఆయువు క్షీణిస్తుంది. భవిష్యమాలిక (గ్రంధాల ప్రకారం, ఏఏ 35 రకాల పాపాల లన కలియుగం యోక్క కాలము క్షీణించబోతుందో వాటి పేర్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి–
- తండ్రి హత్య
- మాతృహత్య
- ప్రీ హత్య
- శిశుహత్య
- గోహత్య
- (బ్రహ్మ హత్య
- థ్రూణ హత్య
- మాతృ అపహరణ
- సోదరి అపహరణ
- కన్య అపహరణ
- సోదరుని భార్య అపహరణ
- వితంతు స్ర్తీ అపహరణ
- పరాయి మహిళ అపహరణ
- స్ర్తీ హరణ
- గర్భిణీ స్త్రీ అపహరణ
- కుమారి అపహరణ
- జంతు అపహరణ
- భూమి హరణ
- పరాయి సంపద అపహరణ
- మ్లేచ్చా వేషధారణ
- తినకూడని ఆహారాన్ని తినడం
- గమ్యం లేని ప్రయాణం
- అతి నిరాశ
- కుటుంబ వైరాగ్యం
- స్నేహితుడిని మోసం చేయడం
- విశ్వాసఘాతం
- తక్కువ కులం వారితో ప్రీతి చెందడం
- నగ్నంగా స్నానం చేయడం
- నగ్నంగా పడుకోవడం
- తప్పుడు ప్రసంగం చేయడము
- సత్ గ్రంథాలను నిందించడం
- ఆవు మేత పచ్చిక , శృశాన వాటికను ఆక్రమించడం / హూరణ
- తులసీ మాతని పూజించకపోవడం
- విష్ణుమూర్తిని పూజించకపోవడం
- తండ్రిని, తల్లిని పూజించకపోవుట (గౌరవించకపోవడము)
పైన చెప్పిన పాపకర్శల వల్ల కలియుగం యొక్క ఆయువు క్షీణించి 5 వేల సంవత్సరాలు మాత్రమే అనుభవించవలసి ఉండును. ఈవిషయాలన్నీ మహాపురుష అచ్యుతానంద దాస్ గారు “ఉద్ధవ భక్తి ప్రదాయిని” అనే (గ్రంధంలో (వ్రాశారు. ఇందులో ఉద్ధవులుమరియు మహాప్రభు శ్రీ కృష్ణులవారి మధ్య సంభాషణ ఉంది. దాని ప్రకారం, కలియుగం ముగింపు గురించి ఉద్ధవులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, శ్రీ కృష్ణుల వారు ఇలా చెప్పారు-
“పారి లక్ష అటే బతిస సహస్త్ర ఆయుష ఎ కలియుగ.
పాప బడిబారు ఆయు కటిజిబ ఆల్బ హోయిబ ఖోగా”
(ఉద్దవ భక్తి (ప్రదాయినీ – అచ్యుతానంద)
అంటే, కలియుగం యొక్క ఆయువు 4,82,000 సంవత్సరాల నుంచి క్షీణించి కేవలం 5,000 సంవత్సరాలు మాత్రమే ఉండును. ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు మరియు అతని ప్రాణ స్పేహితుడు అర్జునుడు మధ్య సంభాషణ జరిగిన సమయంలో అర్జునుడు మహాప్రభు శ్రీ కృష్ణుల వారిని కలియుగం ముగింపు, ధర్మ సంస్థాపన మరియు భగవానుని అవతారం గురించి ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు అర్జునుడికి అనేక లీలల గురించి వివరిస్తాడు. ఈ విషయాలను మహాపురుష భవిష్యమాలిక మహా పురాణము అచ్యుతానంద మహారాజ్ తన పటల), నీల సుందర గీతి మొదలైన అనేక గ్రంధాలలో వ్రాసారు.
అర్జునుడు మహాప్రభు (శ్రీ కృష్ణుడిని ఇలా అడిగాడు “ఓ దేవా, దయచేసి ఏ ఏ పాపాల కారణంగా కలియుగం ఆయువు 4,82,000 సంవత్సరాల నుండి 5,000 మాత్రమే ఉండును మరియు ఏ ఏ పాపాల కారణంగా ఎంతెంత క్షీణించునో దయచేసి చెప్పండి అంటూ ప్రార్ధించెను అప్పుడు శ్రీ కృష్ణుల వారు ముఖ్యమైన పాప కర్మల గురించి ఇలా”
- అబద్ధం యొక్క పాపం నుండి: 5000 సంవత్సరాలు
- గంగానదిలో నగ్న స్నానం: 12000 సంవత్సరాలు
- ద్విజ ప్రేమ కారణంగా మరెక్కడా: 30000 సంవత్సరాలు
- స్నేహితుడికి ద్రోహం చేసిన పాపం నుండి: 6000 సంవత్సరాలు
- మహావిష్ణువు విగ్రహాన్ని పూజించకపోవడం వల్ల : 17000 సంవత్సరాలు
- తల్లి తులసీ దేవిని పూజించలేదు: 5000 సంవత్సరాలు
- అతిథి సేవ చేయకపోవడం ద్వారా: 6000 సంవత్సరాలు
- రాజద్రోహం యొక్క పాపం నుండి: 40000 సంవత్సరాలు
- తినదగని ఆహారం : 8000 సంవత్సరాలు
- ఇతరుల డబ్బు తీసుకోవడం ద్వారా: 10000 సంవత్సరాలు
- గోహత్య పాపం నుండి: 100000 సంవత్సరాలు
- దాతృత్వాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా: 14000 సంవత్సరాలు
- వితంతు స్త్రీలతో వ్యభిచారం చేయడం: 24000 సంవత్సరాలు
- జీవితాన్ని చంపిన పాపం నుండి: 11000 సంవత్సరాలు
- కులం, మతం, కుల నియమాలు పాటించకుండా ప్రేమించడం ద్వారా: 12000 సంవత్సరాలు
- శిశుహత్య పాపం నుండి: 7000 సంవత్సరాలు
- స్త్రీని చంపిన పాపం నుండి: 32000 సంవత్సరాలు
- ఆవు మేత మరియు శ్మశాన వాటిక లేమి: 40000 సంవత్సరాలు
- తల్లిని అపహరించిన పాపం నుండి: 5000 సంవత్సరాలు
- ద్రోహం యొక్క పాపం నుండి: 40000 సంవత్సరాలు
- మాతృ హత్య మరియు పాపాల నుండి అన్యాయం: 3000 సంవత్సరాలు
ఈ విధంగా కలియుగం యొక్క కాలము 4,82,000 సంవత్సరాల నుండి 4,27,000 సంవత్సరాలు తగ్గి కేవలం 5,000 సంవత్సరాలు మాత్రమే ఉండును. పైన తెలుపబడిన విషయాలు, వివిధ శాసప్రాలు-పురాణాలు మరియు మాలిక (గ్రంథాలు ద్వారా చెప్పబడిన విషయం ఏమిటంటే అనేక పాపకర్మల వల్ల కలియుగం ఆయుష్షు తగ్గిపోయి కేవలం 5,000 సంవత్సరాలు మాత్రమే అనుభవించవలసి ఉండును. అలాగే, శాస్త్ర-పురాణంలో వివరించిన లెక్కల ప్రకారం, ప్రస్తుతం కలియుగం 5,125 వ సంవత్సరం జరుగుతోంది. అంటే కలియుగం పూర్తిగా ముగిసిపోయింది.
“జై జగన్నాథ్”